Breaking News

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు కోర్టు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ


Published on: 02 May 2025 16:44  IST

నేషనల్ హెరాల్డ్‌ సంబంధిత మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్‌ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలంటూ కోర్టు శుక్రవారం ఈ నోటీసులు పంపింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే మాట్లాడుతూ — కొత్త చట్ట నిబంధనల ప్రకారం, నిందితుల వాదనలు వినకుండానే ఛార్జ్‌షీట్‌ను పరిగణించలేమని పేర్కొన్నారు. దీంతో నిందితులైన సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు ఎదుట హాజరయ్యేలా నోటీసులు జారీ చేయాలని తీర్పునిచ్చారు.గత వారం జరిగిన విచారణలో ఈడీ సమర్పించిన పత్రాల్లో కొన్ని లోపాలున్నాయని కోర్టు పేర్కొంది. అందుకే అప్పట్లో నోటీసులు ఇవ్వడం లేదు. ఇప్పుడు, అవసరమైన పత్రాలతో తిరిగి విచారణకు వచ్చి ఈడీ వాదనలు వినిపించడంతో కోర్టు తదనుగుణంగా చర్యలు తీసుకుంది.

ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు ఆరంభం 2014లో జరిగింది. బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును కోర్టు స్వీకరించింది. తర్వాత 2021లో ఈడీ అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.

Follow us on , &

ఇవీ చదవండి