Breaking News

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్, తన ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందంతో కలిసి నేడు అమరావతిని సందర్శించారు. 

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్, తన ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందంతో కలిసి నేడు (ఫిబ్రవరి 16, 2026) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సందర్శించారు. 


Published on: 16 Feb 2026 14:37  IST

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్, తన ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందంతో కలిసి నేడు (ఫిబ్రవరి 16, 2026) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సందర్శించారు. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

గేట్స్ అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ (RTGS)ను సందర్శించి, పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం ఉండవల్లి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు మరియు ఏఐ (AI) ఆధారిత సాగు పద్ధతులను పరిశీలించనున్నారు.

గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో జరుగుతున్న 'సంజీవని' డిజిటల్ హెల్త్ కేర్ ప్రాజెక్టు, విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లోని ఇతర ప్రాజెక్టుల విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మరియు స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలపై చంద్రబాబు ఆయనకు ప్రజంటేషన్ ఇచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి