Breaking News

చాదర్‌ఘాట్ మూసీ నది సమీపంలో ఉన్న ఒక డెకరేషన్ వస్తువుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ (10 జూలై 2026, శుక్రవారం) ఒక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చాదర్‌ఘాట్ మూసీ నది సమీపంలో ఉన్న ఒక డెకరేషన్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి.


Published on: 10 Jul 2026 19:38  IST

హైదరాబాద్‌లోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ (10 జూలై 2026, శుక్రవారం) ఒక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చాదర్‌ఘాట్ మూసీ నది సమీపంలో ఉన్న ఒక డెకరేషన్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి.

గోదాంలో ప్లాస్టిక్, థర్మాకోల్, బట్టలు వంటి సులభంగా అంటుకునే డెకరేషన్ వస్తువులు భారీగా నిల్వ ఉంచడం వల్ల మంటలు క్షణాల వ్యవధిలో తీవ్రరూపం దాల్చాయి. దట్టమైన పొగ, భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఈ మంటలు పక్కనే ఉన్న కొన్ని గుడిసెలకు కూడా వ్యాపించాయి. ఆ గుడిసెలలో ఉన్న ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది.

సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఈ అగ్నిప్రమాదం కారణంగా చాదర్‌ఘాట్ సర్కిల్ నుండి చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్స్ వైపు వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలంలో ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని Hyderabad Traffic Police (X) సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి