Breaking News

భారతదేశ రవాణా రంగంలో పర్యావరణ విప్లవానికి నాంది పలుకుతూ, దేశీయ సాంకేతికతతో రూపొందిన తొలి హైడ్రోజన్ రైలు వాణిజ్య ప్రయాణాల ప్రారంభానికి సిద్ధమైంది

భారతదేశ రవాణా రంగంలో పర్యావరణ విప్లవానికి నాంది పలుకుతూ, దేశీయ సాంకేతికతతో రూపొందిన తొలి హైడ్రోజన్ రైలు వాణిజ్య ప్రయాణాల ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే బోర్డు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


Published on: 29 May 2026 14:13  IST

భారతదేశ రవాణా రంగంలో పర్యావరణ విప్లవానికి నాంది పలుకుతూ, దేశీయ సాంకేతికతతో రూపొందిన తొలి హైడ్రోజన్ రైలు వాణిజ్య ప్రయాణాల ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే బోర్డు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పైలట్ రూట్: ఈ రైలు హరియాణాలోని దిల్లీ డివిజన్ పరిధిలో గల జింద్సోనిపట్ మార్గంలో (సుమారు 89 కి.మీ) పరుగులు పెట్టనుంది.

కోచ్‌ల సామర్థ్యం: ఇది 10 కోచ్‌లతో కూడిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రాడ్-గేజ్ హైడ్రోజన్ రైలుసెట్.

రైలు వేగం: ప్రారంభ దశలో ఈ రైలు గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

సాంకేతిక సామర్థ్యం: ఇందులో 1,200 కిలోవాట్ల (KW) హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థ (మొత్తం పవర్ 2,400 KW) అమర్చబడింది. దీనిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో తయారు చేశారు.

జీరో కాలుష్యం: సాంప్రదాయ డీజిల్ ఇంజన్లలా కాకుండా, ఈ రైలు కేవలం హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్తును తయారు చేసుకుంటుంది. దీని వల్ల వాతావరణంలోకి ఎలాంటి హానికరమైన పొగ రాదు, కేవలం నీటి ఆవిరి మాత్రమే ఉద్గారంగా వెలువడుతుంది.

స్వదేశీ రీఫ్యూయలింగ్ కేంద్రం: రైలులో ఇంధనం నింపడం కోసం జింద్‌లో ₹120 కోట్లతో స్వదేశీ హైడ్రోజన్ ప్లాంట్, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని రైల్వే శాఖ నిర్మించింది. ఇందుకు పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) నుంచి అనుమతులు లభించాయి.

ప్రయాణికుల భద్రత: హైడ్రోజన్ లీకేజీలను లేదా మంటలను వెంటనే పసిగట్టే అత్యాధునిక డిటెక్టర్లు, సెన్సర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ప్రారంభమైన మొదటి 3 నెలల పాటు ఎలాంటి సాంకేతిక లోపాలు రాకుండా ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులు రైలులోనే ప్రయాణిస్తూ పర్యవేక్షిస్తారు.

ప్రపంచ దేశాల సరసన భారత్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, జపాన్, చైనా, స్వీడన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు పూర్తిగా పట్టాలెక్కితే, వాణిజ్యపరంగా హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని 5 దేశంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించనుంది. 2030 నాటికి 'నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్' (సంపూర్ణ కాలుష్య రహిత రైల్వే) సాధించాలనే భారత రైల్వే లక్ష్యంలో ఇది ఒక భారీ మైలురాయి కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement