Breaking News

చెన్నై పోర్టులో భారీగా అక్రమంగా దిగుమతి చేసిన చైనా బాణసంచాను అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై పోర్టులో భారీగా అక్రమంగా దిగుమతి చేసిన చైనా బాణసంచాను అధికారులు ఈరోజు (6 అక్టోబర్ 2026) స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌కు అందిన పక్కా సమాచారంతో అధికారులు చెన్నై పోర్టులో ఈ తనిఖీలు చేపట్టారు.

Published on: 06 Oct 2026 15:12  IST

చెన్నై పోర్టులో భారీగా అక్రమంగా దిగుమతి చేసిన చైనా బాణసంచాను అధికారులు ఈరోజు (6 అక్టోబర్ 2026) స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌కు అందిన పక్కా సమాచారంతో అధికారులు చెన్నై పోర్టులో ఈ తనిఖీలు చేపట్టారు.

సరుకు విలువ: పట్టుబడిన చైనా పైరోటెక్నిక్‌ బాణసంచా విలువ సుమారు రూ. 12 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తప్పుడు డిక్లరేషన్ : కంటైనర్లలో చైనా బాణాసంచాను దాచి ఉంచి, కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి వాటిని స్టేషనరీ వస్తువులు, మెడికల్ గ్లోవ్స్, ప్లాస్టిక్ క్లిప్‌లు, హెయిర్ బ్యాండ్‌లు, స్టోరేజ్ వార్డ్‌రోబ్‌లు, షూ ర్యాక్‌లుగా డిక్లేర్ చేశారు.

నిషేధం: భారతదేశ విదేశీ వాణిజ్య విధానం ప్రకారం చైనా బాణసంచా దిగుమతిపై ఆంక్షలు ఉన్నాయి. DGFT మరియు PESO సంస్థల నుంచి ముందస్తు అనుమతులు లేకుండా వీటిని తీసుకురావడం చట్టవిరుద్ధం.ఈ సరుకును కస్టమ్స్ చట్టం 1962 కింద సీజ్ చేశారు.

దీపావళి పండుగ దగ్గరపడుతున్న నేపథ్యంలో, భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్న ఈ భారీ విదేశీ బాణాసంచా నెట్‌వర్క్‌ను DRI అధికారులు సమర్థవంతంగా అడ్డుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి