Breaking News

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో కీలక మార్పులు 

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం (మార్చి 14, 2026) సందర్భంగా నిర్వహించాల్సిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Published on: 10 Mar 2026 12:51  IST

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం (మార్చి 14, 2026) సందర్భంగా నిర్వహించాల్సిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తొలుత పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించినప్పటికీ, ఎండల తీవ్రత మరియు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేశారు.రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి బదులుగా, ప్రతి జిల్లా, నగర, మండల కేంద్రాలు మరియు పంచాయతీల స్థాయిలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికే ఈ ఆవిర్భావ వేడుకల ప్లాన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గాల్లో పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలి.వివిధ ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం సూచించింది.సభ్యత్వం పొందిన జనసైనికులు, వీరమహిళలు ఈ వేడుకల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని నిర్ణయించారు.

Follow us on , &

ఇవీ చదవండి