Breaking News

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ అధికారికంగా జనతాదళ్ (యునైటెడ్)  పార్టీలో చేరారు. 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఆదివారం, మార్చి 8, 2026 నాడు అధికారికంగా జనతాదళ్ (యునైటెడ్)  పార్టీలో చేరారు. 


Published on: 09 Mar 2026 12:47  IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఆదివారం, మార్చి 8, 2026 నాడు అధికారికంగా జనతాదళ్ (యునైటెడ్)  పార్టీలో చేరారు. 

పాట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా సమక్షంలో నిశాంత్ కుమార్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, ఆయన రాజకీయ వారసుడిగా నిశాంత్ కుమార్‌ను పార్టీలోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

నిశాంత్ కుమార్‌ను కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తన తండ్రి గత 20 ఏళ్లుగా రాష్ట్రం కోసం చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి