Breaking News

నేడు దిల్లీలోని రాష్ట్రపతి భవన్ గంతంత్ర మండపంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరుగుతోంది

నేడు (25 మే 2026) దిల్లీలోని రాష్ట్రపతి భవన్ గంతంత్ర మండపంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం (తొలి విడత) వైభవంగా జరుగుతోంది. భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ వేడుకలో భాగంగా మొదటి విడతలో మొత్తం 66 మంది ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేస్తున్నారు.


Published on: 25 May 2026 14:30  IST

నేడు (25 మే 2026) దిల్లీలోని రాష్ట్రపతి భవన్ గంతంత్ర మండపంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం  వైభవంగా జరుగుతోంది. భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ వేడుకలో భాగంగా మొదటి విడతలో 66 మంది ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ ష పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
2026 పద్మ అవార్డుల ముఖ్యాంశాలు: 
మొత్తం అవార్డులు: ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది.
నేటి పురస్కారాలు: నేటి తొలి విడత వేడుకలో 2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. మిగిలిన అవార్డులను రెండో విడతలో అందజేస్తారు.
మొత్తం విభాగాల వారీగా: 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.
అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలు దక్కాయి.
తెలుగు రాష్ట్రాల నుండి అవార్డు గ్రహీతలు:
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 11 మంది ప్రముఖులు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు (తెలంగాణ నుండి 7, ఆంధ్రప్రదేశ్ నుండి 4). అందులో ప్రముఖులు:
డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ 
మామిడి రామరెడ్డి 
నటేశన్ (కళలు)
దేశవ్యాప్తంగా ప్రముఖ గ్రహీతలు:
పద్మ విభూషణ్: నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ , కేరళ మాజీ సీఎం వి.ఎస్. అచ్యుతానందన్ , వయలిన్ విద్వాంసురాలు ఎన్. రాజం.
పద్మ భూషణ్: ప్రముఖ నటుడు మమ్ముట్టి, గాయని అల్కా యాగ్నిక్, బ్యాంకర్ ఉదయ్ కోటక్, టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృతరాజ్.
పద్మశ్రీ: భారత క్రికెట్ కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్.

Follow us on , &

ఇవీ చదవండి