Breaking News

నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 9,000 ఓట్ల తేడాతో స్టాలిన్ భారీ పరాజయం

2026 మే 4న వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ (M.K. Stalin) తన సొంత నియోజకవర్గమైన కొళత్తూర్ (Kolathur) లో భారీ పరాజయాన్ని చవిచూశారు.


Published on: 04 May 2026 17:54  IST

2026 మే 4న వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్  తన సొంత నియోజకవర్గమైన కొళత్తూర్ లో భారీ పరాజయాన్ని చవిచూశారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో ఆయన సుమారు9,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

TVK అభ్యర్థి వి.ఎస్. బాబు సుమారు 82,000 ఓట్లు సాధించగా, స్టాలిన్ 72,000 ఓట్లకే పరిమితమయ్యారు.ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కొత్త రాజకీయ మార్పు కోరుకున్న యువత మరియు విద్యావంతులు విజయ్ నేతృత్వంలోని TVK వైపు మొగ్గు చూపడం స్టాలిన్ ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.2011 నుండి వరుసగా కొళత్తూర్ నుంచి గెలుస్తూ వస్తున్న స్టాలిన్ కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రిగా ఉంటూ తన సొంత స్థానంలోనే ఓడిపోవడం తమిళ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.ఇదే సమయంలో విజయ్ నేతృత్వంలోని TVK మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం కనబరిచి, రాష్ట్రంలో కొత్త రాజకీయ శకానికి నాంది పలికింది

Follow us on , &

ఇవీ చదవండి