Breaking News

నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్టేజ్-1 చీఫ్ ఇంజనీర్ బి. సురేష్ నాయక్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ

నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్టేజ్-1 చీఫ్ ఇంజనీర్ బి. సురేష్ నాయక్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు జెన్‌కో సీఎండీ ఎస్. హరీష్ ఈ సస్పెన్షన్ వేటు వేశారు.


Published on: 15 Oct 2026 14:52  IST

నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్టేజ్-1 చీఫ్ ఇంజనీర్ బి. సురేష్ నాయక్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు జెన్‌కో సీఎండీ ఎస్. హరీష్ ఈ సస్పెన్షన్ వేటు వేశారు.
నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపాలు: విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రాధాన్యత పనుల ప్రణాళిక, పర్యవేక్షణ, మరియు అమలులో సురేష్ నాయక్ తీవ్ర నిర్లక్ష్యం వహించారని, సూపర్వైజరీ లోపాలు ఉన్నాయని ఉన్నతాధికారులు గుర్తించారు. సిబ్బందిని సమన్వయం చేయడంలో, పనులను సకాలంలో పూర్తి చేయించడంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు.
యూనిట్ నిలిచిపోవడం: ప్లాంట్‌లోని 800 మెగావాట్ల యూనిట్-1 నిలిచిపోవడం, దానివల్ల విద్యుత్ ఉత్పత్తిలో భారీ నష్టం వాటిల్లడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు: రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఉన్నతాధికారులపైనైనా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఈ సస్పెన్షన్ వేటు పడింది.
నిబంధనలు: సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్‌క్వార్టర్స్ యాదాద్రి పవర్ ప్లాంట్ , దామరచర్లలోనే ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని జెన్‌కో సీఎండీ స్పష్టం చేశారు.
ప్లాంట్‌లో పర్యవేక్షణ , విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు గానూ, ప్రభుత్వం అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 30 వరకు క్యాంప్ చేయడానికి ఐదుగురు ఐఏఎస్  అధికారులను ప్రత్యేకంగా నియమించింది.

 

Follow us on , &

ఇవీ చదవండి