Breaking News

ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీకి ఎంట్రీ!..3శాతం పడిపోయిన జొమాటో, స్విగ్గీ షేర్లు

ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీకి ఎంట్రీ!..3శాతం పడిపోయిన జొమాటో, స్విగ్గీ షేర్లు


Published on: 13 Feb 2026 18:42  IST

ఈ-కామర్స్ దిగ్గజం Flipkart త్వరలో ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం, ఈ ఏడాది మే–జూన్ మధ్యలో బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి, 2026 చివరికి లేదా 2027 ప్రారంభానికి పూర్తి స్థాయి సేవలను ప్రారంభించే ప్రణాళికలు కంపెనీ పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని The Economic Times వెల్లడించింది.

ఫుడ్ డెలివరీ సేవలను తమ సొంత ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రారంభించాలా? లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ద్వారా అందించాలా? అనే విషయంలో కంపెనీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

ఈ వార్త వెలువడిన వెంటనే ఫుడ్ డెలివరీ రంగంలో ఉన్న కంపెనీల షేర్లపై ప్రభావం పడింది. ముఖ్యంగా Zomato మరియు Swiggy షేర్లు గురువారం సుమారు 3% వరకు పడిపోయాయి. ప్రస్తుతం దాదాపు 9 బిలియన్ డాలర్ల విలువైన భారత ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో ఈ రెండు కంపెనీలే ప్రధానంగా ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.

షేర్ మార్కెట్‌లో జొమాటో షేర్ సుమారు 1.6% తగ్గి రూ.295.9 వద్ద ట్రేడ్ కాగా, స్విగ్గీ షేర్ దాదాపు 3% పడిపోయి రూ.331.75 వద్ద ట్రేడ్ అయింది.

ఇటీవల బైక్ టాక్సీ సేవలతో ప్రసిద్ధి చెందిన Rapido కూడా ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించడం గమనార్హం. దీంతో ఈ రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి