Breaking News

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నకిలి రూ.500 నోట్లు చలామణిపై ప్రజలకు హెచ్చరిక.

ఈ దొంగ నోట్లకు, అసలు నోట్లకు మధ్య చిన్న స్పెల్లింగ్ తేడా.. దీనిని ఇట్టే గుర్తించ వచ్చన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.


Published on: 21 Apr 2025 17:16  IST

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: టెక్నాలజీ అభివృద్ధి మనకు అనేక ప్రయోజనాలు కలిగిస్తోంది. కానీ అదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే, అది మన జీవితాలపై నెగెటివ్‌ ప్రభావం చూపొచ్చు. బ్యాంక్‌ ఖాతాలో డబ్బు జమచేస్తే, క్షణాల్లోనే సైబర్ మోసగాళ్లు వాటిని ఖాళీ చేస్తున్న ఘటనలు ఇప్పుడు సాధారణమవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో, తాజాగా మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, నకిలి రూ.500 నోట్లు ఇప్పుడు చలామణిలోకి వస్తున్నాయి. ఈ నోట్లు నిజమైనవ నోట్లుగా కనిపించినా, క్షుణ్ణంగా గమనిస్తే తప్ప తేడా తెలుసుకోలేం.

అయితే ఈ దొంగ నోట్లకు, అసలు నోట్లకు మధ్య చిన్న స్పెల్లింగ్ తేడా ఉందని.. దీనిని ఇట్టే గుర్తించ వచ్చని ప్రజలకు సూచించారు.సాధారణంగా ప్రతి నోటుపై RESERVE BANK OF INDIA అని ముద్రించబడి ఉంటుంది. కానీ ఈ నకిలీ నోట్లలో "RESERVE" అనే పదంలో ‘E’కి బదులుగా ‘A’ అనే అక్షరం ఉంటుందఅని. ఇదే ప్రధానంగా  పరిశీలించాలని ప్రజలకు సూచించారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.

ఇలాంటి నకిలీ కరెన్సీ చాలా ప్రమాదకరం అని కేంద్రం తెలిపింది. అందువల్ల బ్యాంకులు, వ్యాపార సంస్థలు, ప్రజలు ఎంతగానో అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని డీఆర్ఐ (DRI), సీబీఐ (CBI), ఎన్‌ఐఏ (NIA) వంటి కీలక దర్యాప్తు సంస్థలతో పంచుకున్నట్లు తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి