Breaking News

పహల్గాం ఘటనకు ప్రతీకారం.. ఉగ్రవాదులపై యుద్ధస్థాయిలో ఆపరేషన్

ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ వీరమరణం.


Published on: 24 Apr 2025 15:47  IST

శ్రీనగర్, ఏప్రిల్ 24: ఇటీవల పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడి నేపథ్యంలో, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్ర మూలాలను ఛేదించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు.

సమాచారం మేరకు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న అనుమానంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి దూదు-బసంత్‌గఢ్ పరిధిలో గాలింపు చేపట్టారు. తనిఖీలు జరుపుతుండగా ఉగ్రవాదులు ముందుగా కాల్పులకు పాల్పడ్డారు. ఇది రెండు వైపుల నుంచి తీవ్ర కాల్పులకు దారితీసింది. ఒక జవాన్ తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Follow us on , &

ఇవీ చదవండి