Breaking News

ఐసిస్ కశ్మీర్ ఈ-మెయిల్స్‌ లో గౌతమ్ గంభీర్‌కు ప్రాణహాని బెదిరింపులు

ఈ మెయిల్స్‌ ఏప్రిల్ 22న వచ్చినట్లు. ఒకటి మంగళవారం మధ్యాహ్నం, మరొకటి సాయంత్రం సమయంలో. ఈ రెండు మెయిల్స్‌లోనూ “I Kill U” అనే పదాలు ఉండటం దీంతో రాజింద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


Published on: 24 Apr 2025 16:20  IST

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ నేత గౌతమ్ గంభీర్‌కు మరోసారి ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. ఇటీవల ఆయనకు “ఐసిస్ కశ్మీర్” పేరిట రెండు ఈ-మెయిల్స్‌ రావడంతో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు.

ఈ మెయిల్స్‌ ఏప్రిల్ 22న వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి మంగళవారం మధ్యాహ్నం, మరొకటి సాయంత్రం సమయంలో గంభీర్‌కు చేరాయి. ఈ రెండు మెయిల్స్‌లోనూ “I Kill U” అనే పదాలు ఉండటం గమనార్హం. దీంతో రాజింద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.

ఇదే తొలిసారి కాదు. 2021 నవంబర్‌లో ఎంపీగా ఉన్న సమయంలో కూడా గంభీర్‌కి ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక, ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై గంభీర్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆయన తన ఎక్స్‌ ఖాతా (ట్విట్టర్‌) ద్వారా ఖండించారు. ఆ దాడిలో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి