Breaking News

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో వడ్డించిన వెజ్ బిర్యానీలో చచ్చిన ఈగ కనిపించిన ఘటనపై ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తీవ్రంగా స్పందించింది

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో వడ్డించిన వెజ్ బిర్యానీలో చచ్చిన ఈగ కనిపించిన ఘటనపై ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తీవ్రంగా స్పందించి, సంబంధిత క్యాటరింగ్ సంస్థకు ₹1 లక్ష రూపాయల భారీ జరిమానా విధించింది.


Published on: 25 Jun 2026 14:31  IST

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో వడ్డించిన వెజ్ బిర్యానీలో చచ్చిన ఈగ కనిపించిన ఘటనపై ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ ٹూరిజం కార్పొరేషన్ (IRCTC) తీవ్రంగా స్పందించి, సంబంధిత క్యాటరింగ్ సంస్థకు ₹1 లక్ష రూపాయల భారీ జరిమానా విధించింది.

అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ప్రయాణికుడు ప్రయాణిస్తున్నారు.ఆయన ఆన్‌బోర్డ్ భోజనంగా వెజ్ బిర్యానీ కాంబో మీల్‌ ఆర్డర్ చేసుకోగా, భోజనం చేసే సమయంలో అందులో చచ్చిన ఈగ కనిపించింది.

ఆహార నాణ్యత చాలా దారుణంగా ఉందంటూ సదరు ప్రయాణికుడు వెంటనే రైలు సిబ్బందికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.రైలు కెప్టెన్, క్యాటరింగ్ మేనేజర్ ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పి, వేరే భోజనం ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ ఆయన దానిని నిరాకరించారు.

IRCTC తీసుకున్న కఠిన చర్యలు

₹1 లక్ష జరిమానా: రైల్వే భోజనంలో పరిశుభ్రత లోపించడంపై వార్తల ప్రకారం IRCTC సదరు క్యాటరింగ్ సంస్థపై తక్షణమే ₹1,00,000 ఫైన్ విధించింది.

షోకాజ్ నోటీసు: నిబంధనలను ఉల్లంఘించినందుకు క్యాటరింగ్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

క్యాటరింగ్ సంస్థ గుర్తింపు: విచారణలో ఈ నాసిరకం భోజనాన్ని సూరత్‌కు చెందిన 'అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.

రైల్వే అధికారుల ఆదేశాలు

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్ సంస్థలకు కొన్ని కఠిన నియమాలను జారీ చేసింది:

నిల్వ ఉంచే కంటైనర్లు తప్పనిసరిగా గాలి చొరబడకుండా (ఎయిర్ టైట్) ఉండేలా చూసుకోవాలి.తాజా ముడి పదార్థాలను మాత్రమే వాడాలి మరియు ప్యాకేజింగ్ సమయంలో పరిశుభ్రత పాటించాలి.ఆహార తయారీ, సరఫరా ప్రతీ దశలోనూ క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు నిర్వహించాలి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement