Breaking News

ఆటో ఓవర్‌హీట్ అయ్యిందన్నాడు..


Published on: 12 Nov 2025 16:22  IST

సాయంత్రం విజయలక్ష్మి అనే వృద్ధురాలు మెహదీపట్నం నుంచి ఆమీర్‌పేట్‌కు వెళ్తూ ఒక ఆటోలో ఎక్కింది. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కారు. లక్డీకపూల్ వద్ద ఆటోకు ఓవర్‌హీట్ అయ్యిందని చెప్పి, ప్రయాణికులను కిందికి దింపిన తర్వాత, ఆ ముగ్గురు ఆటోతో పాటు వృద్ధురాలి పర్సు, బంగారు గొలుసు, నగదు, మొబైల్ ఫోన్, దుస్తులు తీసుకుని పరారయ్యారు. వృద్ధురాలు వెంటనే సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి