Breaking News

ఓ అన్నగా ఎల్లప్పుడూ నీతో ఉంటాను..


Published on: 14 Nov 2025 17:29  IST

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఆస‌క్తిక‌ర పోస్టును ఫేస్‌బుక్‌లో చేశారు.మాగంటి గోపీనాథ్ కుమారుడు వాత్సల్యనాథ్‌తో గ‌తంలో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ.. హిమాన్షు రావు పోస్టు పెట్టారు. ఓ అన్న‌గా ఎల్ల‌ప్పుడూ నీతో ఉంటాను అని చెప్పారు. వాత్సల్యతో తనకు 13 ఏళ్ల స్నేహబంధం ఉందన్న హిమాన్షు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి