Breaking News

ఆర్‌బీఐ భరోసా+ 8% వడ్డీ..


Published on: 03 Jan 2026 12:13  IST

ఆర్‌బీఐ రెపో రేటును ఇటీవల తగ్గించడంతో దాదాపు అన్ని బ్యాంకులూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేశాయి. ఏ కమర్షియల్‌ బ్యాంక్‌ చూసినా 6-6.50 శాతం మించి వడ్డీ ఇవ్వడం లేదు. దీంతో అధిక వడ్డీతో కూడిన పెట్టుబడి సాధనాల కోసం చాలామంది అన్వేషిస్తున్నారు. అదే రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్‌, 2020. ఈ బాండ్లపై అధిక వడ్డీతో పాటు ఆర్‌బీఐ భరోసా ఉంటుంది. దీనిపై ప్రస్తుతం ఏటా 8.05 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి