Breaking News

ఫిబ్రవరిలో మరో డీఎస్సీ


Published on: 03 Jan 2026 13:09  IST

ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 2,500 పోస్టులతో నోటిఫికేషన్‌ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది.

Follow us on , &

ఇవీ చదవండి