Breaking News

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య


Published on: 03 Jan 2026 18:13  IST

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణహత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం దుండగుల దాడిలో గాయపడ్డ బెంగాలీ హిందూ వ్యాపారవేత్త ఖోకోన్ దాస్ (50) చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారని స్థానిక మీడియా నివేదించింది. డిసెంబర్ 31న బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ జిల్లాలో దుకాణం యజమాని అయిన దాస్‌ ఇంటికి తిరిగి వస్తుండగా కత్తితో పొడిచి, కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. తమకు శత్రువులు ఎవరూ లేరని, ఆయనపై ఎందుకు దాడి చేశారో తెలియదని ఖోకన్‌ భార్య సీమా దాస్‌ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి