Breaking News

అవయవదాత కుటుంబానికి రూ.లక్ష సాయం


Published on: 05 Jan 2026 12:25  IST

అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాల త్యాగాన్ని గుర్తిస్తూ రూ.లక్ష చొప్పున అందజేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలకు కాస్త అయినా సాంత్వన చేకూరడమే కాకుండా.. అవయవ దానాన్ని మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. గత ఏడాదిలో 93 మంది జీవన్మృతుల ద్వారా సేకరించిన అవయవాలను 301 మందికి అమర్చినట్లు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి