Breaking News

జైలు నుంచి వంశీ విడుదల


Published on: 02 Jul 2025 15:44  IST

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదలయ్యారు. ఈరోజు (బుధవారం) విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్ల‌పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని, తలశిల రఘురామ్ కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి