Breaking News

బీబీసీ పై భారత ప్రభుత్వం ఆగ్రహం


Published on: 28 Apr 2025 13:09  IST

బీబీసీ తన వ్యాసంలో ఈ ఉగ్రవాద దాడిని "మిలిటెంట్ దాడి"గా పేర్కొంది."ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారతీయులకు వీసాలను నిలిపివేసింది" అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో,దాడి చేసిన వారిని "మిలిటెంట్లు" అని సంబోధించడం భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కవరేజ్‌ను "ఉగ్రవాద దాడి తీవ్రతను తగ్గించే ప్రయత్నం"గా భావించింది.విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఎక్స్‌టర్నల్ పబ్లిసిటీ, పబ్లిక్ డిప్లొమసీ విభాగం,బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు ఒక అధికారిక లేఖ రాసింది.

Follow us on , &

ఇవీ చదవండి