Breaking News

చెన్నైలో భారీ వర్షం..నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు


Published on: 28 Oct 2025 15:40  IST

మొంథా తుఫాను ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై (Chennai)లో భారీ వర్షం (Heavy rain) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడనంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి