Breaking News

కుక్కపిల్లను నేలకేసి కొట్టి చంపిన పనిమనిషి


Published on: 04 Nov 2025 11:58  IST

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోపంతో ఓ యువతి కుక్కపిల్లను ఘోరంగా చంపింది. ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నవారు కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. ఆ కుక్క పిల్లపై కోపం పెంచుకున్న పనిమనిషి, సరైన సమయం కోసం వేచిచూసింది. అగ్రహావేశంతో ఎవ్వరూ చూడకముందు కుక్కను చంపేయాలని ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా ఆ కుక్కను ఎవరూ చూడకముందు చంపేసింది. ఆ తరువాత తనకేమీ తెలియదన్నట్లు నాటకమాడింది.

Follow us on , &

ఇవీ చదవండి