Breaking News

Indiramma Housing: రూ. 5 లక్షలు.. 15 రోజులు


Published on: 09 May 2025 09:38  IST

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఓ స్టార్టప్‌ కంపెనీ షీర్‌వాల్‌ టెక్నాలజీతో 400 చ.అ.లోపు నమూనా ఇందిరమ్మ ఇంటిని నిర్మించింది. 15 రోజుల్లో రూ.5 లక్షలలోపు ఖర్చుతో ఇంటిని పూర్తి చేశారు. ఆరు కార్మికులే ఈ పనిని పూర్తిచేయగా, పునాది నుంచి ఫినిషింగ్‌ వరకు ప్రతి దశను తక్కువ సమయంలో పూర్తి చేశారు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్‌ అవసరం ఉండదని, 60 ఏళ్ల మన్నిక ఉంటుందని సంస్థ తెలిపింది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలతో పేదలకు నాణ్యమైన ఇళ్లను అందించేందుకు ఈ విధానం దోహదపడనుంది.

Follow us on , &

ఇవీ చదవండి