Breaking News

నందగిరి హిల్స్లో ఒక ఇంట్లో భారీ దొంగతనం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఫిబ్రవరి 6, 2026న జరిగిన ఘరానా చోరీ .జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్ ప్రాంతంలో ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.


Published on: 06 Feb 2026 15:06  IST

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఫిబ్రవరి 6, 2026న జరిగిన ఘరానా చోరీ .జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్ ప్రాంతంలో ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.నేపాల్‌కు చెందిన భువన్ అనే వ్యక్తి 15 రోజుల క్రితం ఆ ఇంట్లో వంట మనిషిగా చేరాడు.ఫిబ్రవరి 5 రాత్రి తన పుట్టినరోజు అని నమ్మించి, తోటి పని మనుషులకు మరియు వాచ్‌మెన్‌కు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత తన ముఠాతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు.బీరువాలోని సుమారు రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మరియు నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.

జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. వారు నగరం విడిచి వెళ్లకుండా రైల్వే స్టేషన్లు మరియు ఎయిర్‌పోర్టులను  పోలీసులు అప్రమత్తం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి