Breaking News

తొర్రూరు  మున్సిపాలిటీలో రణరంగం

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు  మున్సిపాలిటీలో ఫిబ్రవరి 16, 2026న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


Published on: 16 Feb 2026 16:10  IST

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు  మున్సిపాలిటీలో ఫిబ్రవరి 16, 2026న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. 

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే ఎక్స్-ఆఫీషియో సభ్యుల ఓట్లతో మేజిక్ ఫిగర్ సాధించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించడంతో వివాదం మొదలైంది.

మున్సిపల్ కార్యాలయం ముందే ఇరు వర్గాలు బలప్రదర్శనకు దిగడంతో పరస్పరం దాడులు జరిగాయి.ఈ ఉద్రిక్తత సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి ఉషారాణి, ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ఝాన్సీ రెడ్డి తదితరులు రంగంలోకి దిగారు.మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి