Breaking News

మార్కెట్ యార్డులో పసుపు రైతుల ఆందోళన

26 ఫిబ్రవరి 2026న నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. e-NAM పోర్టల్‌లో సాంకేతిక లోపాలు, తక్కువ మద్దతు ధర మరియు కొనుగోళ్లలో జాప్యం ఈ నిరసనకు ప్రధాన కారణాలు. 


Published on: 26 Feb 2026 17:55  IST

26 ఫిబ్రవరి 2026న నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. e-NAM పోర్టల్లో సాంకేతిక లోపాలుతక్కువ మద్దతు ధర మరియు కొనుగోళ్లలో జాప్యం ఈ నిరసనకు ప్రధాన కారణాలు. 

గత మూడు రోజులుగా e-NAM సర్వర్ పని చేయకపోవడంతో పసుపు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు మరియు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.మార్కెట్‌లో పసుపుకు ఆశించిన మద్దతు ధర లభించడం లేదని, క్వింటాల్‌కు సగటున ₹9,000 నుండి ₹11,300 మధ్య ధర పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి