Breaking News

బావిలో దూకి మహిళా ఇద్దరు కూతుర్ల ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో 2026 మార్చి 12, గురువారం నాడు ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. జంగమ్మ (42) అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలు జ్యోతి (15), శైలజ (13)తో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 

Published on: 12 Mar 2026 15:53  IST

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో 2026 మార్చి 12, గురువారం నాడు ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. జంగమ్మ (42) అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలు జ్యోతి (15), శైలజ (13)తో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 

జంగమ్మ భర్త బీరయ్య తన వ్యవసాయ పొలంలో రెండో బోరు వేయడానికి సిద్ధమయ్యాడు. మొదటి బోరులో నీళ్లు పడకపోవడంతో రెండో బోరు వేయ వద్దని జంగమ్మ అడ్డు చెప్పింది. అయినా భర్త వినకపోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

జంగమ్మ తన ఇద్దరు కుమార్తెలు మరియు కుమారుడిని వెంటబెట్టుకుని పొలం వద్దకు వెళ్లింది. తొలుత కుమార్తెలను బావిలోకి తోసేసి, ఆపై తానూ దూకేసింది.

జంగమ్మ కుమారుడు జస్వంత్ బావిలో పడ్డాడు, కానీ అదృష్టవశాత్తూ చెట్టు వేరు దొరకడంతో దాన్ని పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. 

Follow us on , &

ఇవీ చదవండి