Breaking News

సబ్రిజిస్ట్రార్ కార్యాలయంపై ACBసోదాలు

వరంగల్ (హనుమకొండ) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏప్రిల్ 2, 2026 గురువారం మధ్యాహ్నం నుంచి ఏప్రిల్ 3 శుక్రవారం వరకు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ సోదాలు నిర్వహించారు.


Published on: 03 Apr 2026 17:28  IST

వరంగల్ (హనుమకొండ) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏప్రిల్ 2, 2026 గురువారం మధ్యాహ్నం నుంచి ఏప్రిల్ 3 శుక్రవారం వరకు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధికారుల అక్రమ సంపదతో పాటు పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్లయిన జమాల్పూర్ రామ్ నర్సింహారావు (SRO-I) మరియు దేవులూరి ఆనంద్ (SRO-II)ఇళ్లలో జరిపిన తనిఖీల్లో దాదాపు ₹24.61 లక్షల నగదు819.5 గ్రాముల బంగారం2.6 కిలోల వెండి మరియు కపిల్ చిట్స్‌లో ₹30.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.

అధికారుల సెల్‌ఫోన్లను పరిశీలించగా, గత ఏడాది కాలంలో డాక్యుమెంట్ రైటర్లతో సుమారు ₹42.03 లక్షల విలువైన ఫోన్ పే లావాదేవీలు జరిగినట్లు వాట్సాప్ చాట్ల ద్వారా వెల్లడైంది.కార్యాలయంలో లెక్కల్లో చూపని ₹47,450 నగదుతో పాటు, ఇంకా రిజిస్టర్ కాని 70 డాక్యుమెంట్లు, మరియు డెలివరీ చేయని 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 20 మంది అనధికార ఏజెంట్లు మరియు డాక్యుమెంట్ రైటర్లను అధికారులు గుర్తించారు."డబ్బులిస్తేనే దస్తావేజులు" అనే ఫిర్యాదుల నేపథ్యంలో, ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక దాడులు జరిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి