Breaking News

నీటి ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు ఇద్దరు మృతి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఏప్రిల్ 14, 2026 మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మరియు అతని రెండున్నరేళ్ల కుమారుడు మృతి చెందారు.


Published on: 15 Apr 2026 12:59  IST

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఏప్రిల్ 14, 2026 మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మరియు అతని రెండున్నరేళ్ల కుమారుడు మృతి చెందారు.హనుమకొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేదప్రకాశ్ రెడ్డి(37), ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి (2).అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ సమీపంలో.ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో మొక్కలకు నీళ్లు పోస్తున్న నీటి ట్యాంకర్‌ను వేదప్రకాశ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు గుర్తించారు.

కారులో ఉన్న వేదప్రకాశ్ రెడ్డి భార్య హిమబిందు, బంధువులు దుర్గాప్రసాద్ రెడ్డి మరియు ఆయన భార్య శ్రీజలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సంతోష్‌నగర్‌లోని DRDO అపోలో ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.వీరంతా హనుమకొండ నుంచి హైదరాబాద్ శివారులోని బొంగుళూరుకు వెళ్తుండగా గమ్యస్థానానికి చేరుకోవడానికి కేవలం 20 నిమిషాల ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 

Follow us on , &

ఇవీ చదవండి