Breaking News

ఆస్తికోసం సొంత అక్కను చంపిన తమ్ముడు

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మలపెన్‌పహాడ్ గ్రామంలో ఆస్తి వివాదం కారణంగా తమ్ముడు తన సొంత అక్కను దారుణంగా హత్య చేసిన ఉదంతం నిజమే.


Published on: 18 May 2026 15:13  IST

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆస్తి వివాదం కారణంగా తమ్ముడు తన సొంత అక్కను దారుణంగా హత్య చేసిన ఉదంతం నిజమే.హత్యకు గురైన మహిళను సురుగి అంజమ్మగా గుర్తించారు. చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో, పిల్లలు లేని ఆమె తన స్వగ్రామంలో చెల్లెలు (ఉపేంద్ర) వద్ద ఉంటోంది.అంజమ్మకు గతంలో పసుపు-కుంకుమల కింద వచ్చిన 2.5 ఎకరాల భూమి ఉంది. తన ఆలనాపాలనా చూసుకుంటున్నందుకు గానూ ఆ భూమిని తన చెల్లెలికి ఇవ్వాలని అంజమ్మ నిర్ణయించుకుంది.ఈ భూమి తనకే దక్కాలనే ఆశతో ఆమె తమ్ముడు సురిగి సైదులు కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచాయితీ జరగగా, అంజమ్మ తన చెల్లెలికి మద్దతుగా మాట్లాడటంతో సైదులు ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఉదయం 6:45 గంటల సమయంలో అంజమ్మ ఉపాధి హామీ (కరువు) పనికి వెళ్తుండగా, సైదులు తన బావమరుదులతో కలిసి ఆమెపై వెనుక నుంచి వచ్చి కల్లు గీసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.పదునైన కత్తితో పలుమార్లు పొడవడంతో తీవ్ర గాయాలపాలైన అంజమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

 

Follow us on , &

ఇవీ చదవండి