Breaking News

హైదరాబాద్లో విద్యుత్ వైర్లను మార్చాలి వీహెచ్

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పాత విద్యుత్ వైర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు (వీహెచ్) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.


Published on: 21 May 2026 19:28  IST

హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పాత విద్యుత్ వైర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు (వీహెచ్) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలంలో వేసిన పాత విద్యుత్ లైన్లు ఉన్నాయని వీహెచ్ పేర్కొన్నారు.ఈ పాత వైర్ల వల్ల తరచూ షార్ట్ సర్క్యూట్‌లు జరుగుతున్నాయని, దీనివల్ల వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆస్తి, ప్రాణ నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ (భీమా) లేని చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన గుర్తుచేశారు.వ్యాపారుల విజ్ఞప్తి మేరకు నగరంలో ప్రమాదాలు తగ్గించడానికి, తక్షణమే కొత్త విద్యుత్ వైర్లను వేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి