Breaking News

రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తులకు గాయాలు

కామారెడ్డి - ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట మండలం కొయ్యగుండు తండా శివారులో గురువారం (18 జూన్ 2026) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.


Published on: 18 Jun 2026 14:54  IST

కామారెడ్డి - ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట మండలం కొయ్యగుండు తండా శివారులో గురువారం (18 జూన్ 2026) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

లింగంపేట మండలంలోని కొయ్యగుండు తండా శివారులో గల కామారెడ్డి - ఎల్లారెడ్డి ప్రధాన రహదారి.కొయ్యగుండు తండాకు చెందిన రామావత్ సునీత అనే మహిళ పొలం పనులు ముగించుకుని రహదారి దాటుతోంది.అదే సమయంలో కామారెడ్డి నుంచి పెరుగు బకెట్లతో ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ సతీష్, రోడ్డు దాటుతున్న మహిళను చూసి అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు.బ్రేక్ వేయడంతో వాహనం పూర్తిగా అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తా పడింది.ఆటో డ్రైవర్ సతీష్ ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.రామావత్ సునీత రోడ్డు దాటుతున్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది (కృష్ణ, ప్రకాష్‌గౌడ్) ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు బాధితులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు.అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం బాధితులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement