Breaking News

ఆదిలాబాద్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఆదిలాబాద్ పట్టణంలోని ఎదులాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం (25 జూన్ 2026) తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


Published on: 25 Jun 2026 16:53  IST

ఆదిలాబాద్ పట్టణంలోని ఎదులాపురం (మావల బైపాస్) సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం (25 జూన్ 2026) తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆదిలాబాద్‌ పట్టణ పరిధిలోని ఎదులాపురం - మావల బైపాస్ సమీపంలో గల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.తలమడుగు మండలం పల్లి(బి) గ్రామానికి చెందిన కొందరు రైతులు ఆటోలో కూరగాయలు వేసుకుని తరలిస్తుండగా, వేగంగా వచ్చిన ఒక లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement