Breaking News

తెలంగాణ డీఎస్పీ నివాసంపై ACBసోదాలు

తెలంగాణ డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ప్రాంతాలలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఈరోజు, 2 జులై 2026 గురువారం ఉదయం నుండి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.


Published on: 02 Jul 2026 11:12  IST

తెలంగాణ డీఎస్పీ ఎస్. భీమ్రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ప్రాంతాలలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు, 2 జులై 2026 గురువారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు.

ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఆయన ప్రధాన నివాసంతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన సుమారు 20 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు చేపట్టాయి.భీమ్‌రెడ్డి నివసిస్తున్న రూ. 8 కోట్ల విలువైన విల్లాతో పాటు భారీగా చరాస్తులు, స్థిరాస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.ఆదాయ వనరులకు మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతోనే ఈ డ్రైవ్ చేపట్టారు. ప్రస్తుతం ఆస్తుల విలువపై అధికారులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement