Breaking News

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

కరీంనగర్‌లో భార్య వేధింపులు తట్టుకోలేక కల్యాణం రాకేశ్ (27) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.


Published on: 06 Jul 2026 19:56  IST

కరీంనగర్‌లో భార్య వేధింపులు తట్టుకోలేక కల్యాణం రాకేశ్ (27) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.కరీంనగర్ జిల్లా కొత్తపల్లి (హవేలి) గ్రామానికి చెందిన కల్యాణం రవి కుమారుడైన రాకేశ్, రెండేళ్ల క్రితం (2024లో) హైదరాబాద్‌కు చెందిన సంజన (అలియాస్ వర్ష) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లయిన తర్వాత వీరిద్దరూ కరీంనగర్ రూరల్ పరిధిలోని తీగలగుట్టపల్లి, సరస్వతినగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇంకా పిల్లలు లేరు.కొంతకాలంగా సంజన తన భర్తను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాకేశ్‌ను తన సొంత తల్లిదండ్రులను కలువకుండా, వారితో ఫోన్‌లో కూడా మాట్లాడకుండా ఆంక్షలు విధించి వేధించేది. దీనితో పాటు బంగారు ఆభరణాలు తీసుకురావాలని కూడా ఆమె ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.భార్య పెడుతున్న మానసిక టార్చర్ భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్, జూలై 4 (శనివారం) మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పోలీసుల దర్యాప్తు

మృతుడి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి