Breaking News

దోమలగూడ ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం

హైదరాబాద్ దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మిక కుటుంబాలు దోమలగూడలోని ఫరీద్ బస్తీలో నివసిస్తున్నాయి.


Published on: 20 Jul 2026 17:14  IST

హైదరాబాద్ దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మిక కుటుంబాలు దోమలగూడలోని ఫరీద్ బస్తీలో నివసిస్తున్నాయి. ఆ కుటుంబాలకు చెందిన ముగ్గురు బాలికలు ఆదివారం (19 జూలై 2026) మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

సహిత కుమారి, స్నేహ కుమారి (ఇద్దరు అక్కాచెల్లెళ్లు), మరియు వీరి బంధువైన లత అనే మరో బాలిక.ఈ ముగ్గురు బాలికలు హిమాయత్‌నగర్ నుంచి ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు, ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు సీసీటీవీ (CCTV) ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వీరు తమ స్వస్థలమైన ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే రైలు ఎక్కి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి