Breaking News

మహీంద్రా కార్ల షోరూమ్లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని అంబర్‌పేట చే నంబర్ కూడలి వద్ద ఉన్న మహీంద్రా కార్ల షోరూమ్ (సర్వీస్ సెంటర్) లో ఏప్రిల్ 27, 2026న (సోమవారం) భారీ అగ్నిప్రమాదం సంభవించింది.


Published on: 28 Apr 2026 15:45  IST

హైదరాబాద్‌లోని అంబర్పేట చే నంబర్ కూడలి వద్ద ఉన్న మహీంద్రా కార్ల షోరూమ్ (సర్వీస్ సెంటర్) లో ఏప్రిల్ 27, 2026న (సోమవారం) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 

అంబర్‌పేట్ 6 నంబర్ చౌరస్తాలో ఉన్న మహీంద్రా సర్వీస్ సెంటర్.షోరూమ్ వెలుపల నిలిపి ఉంచిన అనేక కొత్త వాహనాలు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. షోరూమ్ లోపలికి కూడా మంటలు వ్యాపించాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎయిర్ కండిషనర్లు (ACs) నిరంతరాయంగా పనిచేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లడం సిబ్బందికి కష్టతరమైంది.మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా నల్లటి పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. 

 

Follow us on , &

ఇవీ చదవండి