Breaking News

ముగ్గురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి

ఖమ్మం కార్పొరేషన్‌లో బుధవారం (7 జనవరి 2026) బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ముగ్గురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. 

Published on: 07 Jan 2026 17:55  IST

ఖమ్మం కార్పొరేషన్‌లో బుధవారం (7 జనవరి 2026) బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ముగ్గురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. 

ధనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగని శ్రీదేవి.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో వీరు హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అంతకుముందు సోమవారమే (5 జనవరి 2026) ఐదుగురు మహిళా కార్పొరేటర్లు (సి.హెచ్. లక్ష్మి, జి. చంద్రకళ, డి. సరస్వతి, అమృతమ్మ, ఎం. శ్రావణి) కాంగ్రెస్‌లో చేరారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఖమ్మం పర్యటనకు వెళ్తున్న తరుణంలోనే ఈ ముగ్గురు కార్పొరేటర్లు పార్టీ వీడటం గమనార్హం.

గడిచిన కొద్ది రోజుల్లోనే మొత్తం 8 మంది కార్పొరేటర్లు బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌కు మారారు. 

Follow us on , &

ఇవీ చదవండి