Breaking News

మీర్‌పేట్లో భార్యను కత్తితో నరికి చంపిన భర్త

హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం (29 ఏప్రిల్ 2026) తెల్లవారుజామున ఒక దారుణ హత్య జరిగింది. అనుమానంతో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో నరికి హత్య చేశాడు.


Published on: 29 Apr 2026 17:09  IST

హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం (29 ఏప్రిల్ 2026) తెల్లవారుజామున ఒక దారుణ హత్య జరిగింది. అనుమానంతో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో నరికి హత్య చేశాడు. నరసింహ (60),వసంత (52) వీరిద్దరూ నల్గొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందినవారు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ (టీచర్స్ కాలనీ) లో నివసిస్తున్నారు.

బుధవారం తెల్లవారుజామున నిందితుడు నరసింహ తన భార్య ప్రవర్తనపై అనుమానంతో వంటగదిలోని కత్తితో ఆమెపై తీవ్రంగా దాడి చేసి చంపాడు. కొందరు ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం, నిందితుడు ఆమె తల నరికినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి