Breaking News

బిజెపి కార్యకర్తలు పై పోలీసుల లాఠీఛార్జి

ఫిబ్రవరి 11, 2026 బుధవారం రోజున తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా పరిషత్ (ZP) కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది.

Published on: 11 Feb 2026 16:30  IST

ఫిబ్రవరి 11, 2026 బుధవారం రోజున తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా పరిషత్ (ZP) కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది.

కరీంనగర్ 58వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బిజెపి (BJP) కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో బిజెపి కార్యకర్తలకు మరియు బిఆర్ఎస్ (BRS) అభ్యర్థి రవిందర్ సింగ్ అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది.పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు బిజెపి కార్యకర్తలు గాయపడ్డారు.పోలీసుల తీరుకు నిరసనగా బిజెపి కార్యకర్తలు నడిరోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 

Follow us on , &

ఇవీ చదవండి