Breaking News

వరంగల్ బస్టాండ్ లో ఇంటి దొంగలు

వరంగల్ తాత్కాలిక బస్టాండ్‌లో రక్షణ కల్పించాల్సిన హోంగార్డే ప్రయాణికుల వస్తువులను దొంగిలిస్తూ "ఇంటి దొంగ"గా మారిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బస్టాండ్‌లో భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న ఒక అవుట్‌సోర్సింగ్ హోంగార్డు ప్రయాణికుల వస్తువులను చోరీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Published on: 30 Jul 2026 16:15  IST

వరంగల్ తాత్కాలిక బస్టాండ్‌లో రక్షణ కల్పించాల్సిన హోంగార్డే ప్రయాణికుల వస్తువులను దొంగిలిస్తూ "ఇంటి దొంగ"గా మారిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బస్టాండ్‌లో భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న ఒక అవుట్‌సోర్సింగ్ హోంగార్డు ప్రయాణికుల వస్తువులను చోరీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ దొంగతనంపై ఆర్టీసీ (TGSRTC) అధికారులు అంతర్గత విచారణ జరిపి, సదరు హోంగార్డును గత నెలలోనే విధుల్లో నుంచి తొలగించారు.వరంగల్ తాత్కాలిక బస్టాండ్‌ పరిసరాల్లో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దొంగతనాలకు అడ్డుకట్ట వేయడం కష్టంగా మారుతోంది. భద్రతను పర్యవేక్షించాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి