Breaking News

చిట్టాపూర్‌లో అగ్నిప్రమాదం ఈతవనం దగ్ధం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్‌లో 2026 మే 22, శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఈతవనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఈత వనంలో సుమారు 1500 ఈత చెట్లు ఉండగా, మంటల కారణంగా అవి కాలిపోయాయి.


Published on: 22 May 2026 16:01  IST

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్‌లో 2026 మే 22, శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఈతవనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఈత వనంలో సుమారు 1500 ఈత చెట్లు ఉండగా, మంటల కారణంగా అవి కాలిపోయాయి. వాటితో పాటు అక్కడున్న బోర్ మోటార్, పైపులైన్లు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ఈ వనంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 80 గీత కార్మిక కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం ఉదయం కల్లు దింపడానికి గీత కార్మికులు ఈత వనానికి వెళ్లిన సమయంలో చెట్లకు మంటలు వ్యాపించడాన్ని గమనించారు. వెంటనే స్థానిక సర్పంచ్ భర్త సుంకేట గంగాధర్ ద్వారా అగ్నిమాపక (Fire) సిబ్బందికి సమాచారం అందించారు.ఘటన జరిగిన దెగ్గరికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాధితులు తమ్ము ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి