Breaking News

ప్రేమ పేరుతో మోసం యువతి ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ప్రేమ పేరుతో జరిగిన మోసం కారణంగా మాలోతు రమ్య (19) అనే యువతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.


Published on: 27 May 2026 15:32  IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ప్రేమ పేరుతో జరిగిన మోసం కారణంగా మాలోతు రమ్య (19) అనే యువతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. పెళ్లికి నిరాకరిస్తూ ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.మరిపెడ మండలం, ఎల్లంపేట శివారు లక్ష్మాతండాకు చెందిన మాలోతు రమ్య (19)బోట్యాతండాకు చెందిన ధరంసోత్ సుమన్.రమ్య, సుమన్ కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు .గత కొన్ని రోజులుగా పెళ్లి ప్రస్తావన రాగా, యువకుడు తప్పించుకుంటూ వచ్చాడు.ఈ నెల మే 22 "నిన్ను పెళ్లి చేసుకోను.. వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటాను" అని సుమన్ ముఖం మీదే చెప్పడంతో రమ్య తీవ్ర మనోవేదనకు గురైంది.ప్రియుడి మాటలతో విరక్తి చెందిన రమ్య, ఇంట్లోనే ఎలుకల మందు తాగింది.

ఎలుకల మందు తాగిన రమ్యను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం (మే 26) రమ్య ప్రాణాలు విడిచింది.చనిపోయే ముందు రమ్య ఇచ్చిన మరణ వాంగ్మూలంలో సుమన్ తనను ప్రేమ పేరుతో ఎలా మోసం చేశాడనే విషయాలను స్పష్టంగా వివరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి