Breaking News

ఇంటి నుంచే తపాలా బీమా చెలింపులు

తపాలా జీవిత బీమా , గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియం చెల్లింపులను పాలసీదారులు ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా సులభంగా చెల్లించవచ్చు. వినియోగదారుల సౌకర్యార్థం తపాలా శాఖ డిజిటల్ సేవలను పూర్తిగా ఆధునీకరించింది.


Published on: 28 Jul 2026 14:58  IST

తపాలా జీవిత బీమా , గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియం చెల్లింపులను పాలసీదారులు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించవచ్చు. వినియోగదారుల సౌకర్యార్థం తపాలా శాఖ డిజిటల్ సేవలను పూర్తిగా ఆధునీకరించింది.

ఆన్‌లైన్ డిజిటల్ చెల్లింపులు

యూపీఐ : ఎలాంటి అదనపు రుసుములు లేకుండా Google Pay, PhonePe లేదా QR కోడ్ ద్వారా వేగంగా డబ్బులు కట్టవచ్చు.

IPPB మొబైల్ యాప్: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మీ పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ ఖాతాలను లింక్ చేసి క్షణాల్లో ప్రీమియం జమ చేయొచ్చు.

నెట్ బ్యాంకింగ్: ప్రముఖ బ్యాంకుల ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు.

డెబిట్ / క్రెడిట్ కార్డులు: మాస్టర్, వీసా లేదా రూపే కార్డుల ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు జరపవచ్చు.

ఆటో డెబిట్ సదుపాయం: మీ బ్యాంక్ ఖాతా నుండి ప్రతి నెలా నిర్ణీత తేదీన ప్రీమియం ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా ఈ సౌకర్యాన్ని సెట్ చేసుకోవచ్చు.

తపాలా సిబ్బంది ద్వారా

పోస్ట్‌మాన్ : ఒకవేళ మీకు ఆన్‌లైన్ చెల్లింపులు తెలియకపోతే, మీ ప్రాంతానికి వచ్చే పోస్ట్‌మాన్ లేదా గ్రామీణ డాక్ సేవక్ వద్ద ఉండే మైక్రో ఏటీఎం పరికరాల ద్వారా కూడా మీ IPPB ఖాతా నుండి ప్రీమియం చెల్లించవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement