Breaking News

డంపింగ్ యార్డ్ రద్దుకు పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్

హుజూరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిఏప్రిల్ 4న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతానని ప్రకటించారు.


Published on: 02 Apr 2026 15:01  IST

హుజూరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిఏప్రిల్ 4న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతానని ప్రకటించారు. పట్టణం నడిబొడ్డున ఈ యార్డును ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

డంపింగ్ యార్డ్ ఏర్పాటును ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తానే స్వయంగా నిరసన దిగుతానని, "దండం పెడతా డంపింగ్ యార్డ్ వద్దు" అంటూ అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం కావాలనే తనకు సీఐడీ నోటీసులు జారీ చేసిందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పాత కేసులకు సంబంధించి ఏప్రిల్ 4న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు.

హుజూరాబాద్ శివారులోని రంగాపూర్, రాంపూర్ గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ యార్డుకు వ్యతిరేకంగా గత పది రోజులుగా స్థానిక ప్రజలు, విద్యార్థులు కూడా పోరాటాలు చేస్తున్నారు.కరీంనగర్ కాలుష్యాన్ని హుజూరాబాద్‌కు తీసుకురావద్దని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి