Breaking News

హైదరాబాద్ హయత్‌నగర్లో ఘోర రోడ్డుప్రమాదం

మే 27, 2026 బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ జాతీయ రహదారిపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై ఒక కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో రోడ్డుపై నిలిచిపోయింది.


Published on: 27 May 2026 15:15  IST

మే 27, 2026 బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ జాతీయ రహదారిపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై ఒక కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ ఆ ఆగి ఉన్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద తీవ్రతకు టిప్పర్ లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. చిన్నరావిర్యాల గ్రామానికి చెందిన డ్రైవర్ సంపంగి నవీన్ (30) క్యాబిన్ లోపల తీవ్ర గాయాలతో ఇరుక్కుపోయాడు.సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరియు డీఆర్ఎఫ్ (DRF) బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కట్టర్ల సాయంతో సుమారు గంటకు పైగా శ్రమించి నలిగిపోయిన క్యాబిన్ భాగాలను తొలగించి నవీన్‌ను సురక్షితంగా బయటకు తీశారు.తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా మళ్లించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి