Breaking News

16 క్విక్ కామర్స్ స్టోర్ లపై టీజీ సేఫ్ తనిఖీలు

హైదరాబాద్ నగరంలోని 16 క్విక్-కామర్స్ డార్క్ స్టోర్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ వింగ్ (TG SAFE) విస్తృతమైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో తీవ్రమైన ఆహార భద్రతా లోపాలు, అపరిశుభ్రత బయటపడటంతో అధికారులు నాలుగు ప్రముఖ స్టోర్ల FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేస్తూ వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.

Published on: 01 Oct 2026 18:40  IST

హైదరాబాద్ నగరంలోని 16 క్విక్-కామర్స్ డార్క్ స్టోర్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ వింగ్ (TG SAFE) విస్తృతమైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో తీవ్రమైన ఆహార భద్రతా లోపాలు, అపరిశుభ్రత బయటపడటంతో అధికారులు నాలుగు ప్రముఖ స్టోర్ల FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేస్తూ వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.

లైసెన్స్ రద్దయిన 4 ప్రధాన స్టోర్లు:

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కింది అవుట్‌లెట్ల లైసెన్సులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు:

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ : పేట్ బషీరాబాద్ మరియు సైదాబాద్ (SBH బ్యాంక్ కాలనీ) శాఖలు.

ఫ్లిప్‌కార్ట్ ఇన్‌స్టాకార్ట్ :చార్మินార్, పంజేషా రోడ్ శాఖ.

జెప్టో (Zepto): రామ్‌కోటి శాఖ.

గుర్తించిన ప్రధాన లోపాలు:

ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు పోలీసులతో కూడిన 10 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా డార్క్ స్టోర్లలో కింది నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు:

పాడైపోయిన ఆహారం: బూజు పట్టిన చీజ్ ప్యాకెట్లు, కాలీఫ్లవర్‌లో పురుగులు, ఫంగస్ పట్టిన కుళ్లిన కూరగాయలు లభ్యమయ్యాయి.

కాలం చెల్లిన వస్తువులు:ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఆహార పదార్థాలను అలాగే విక్రయానికి ఉంచడం.

కీటకాల బెడద: స్టోర్లలో విపరీతంగా బొద్దింకలు, అపరిశుభ్ర వాతావరణం కనిపించింది.

స్టోరేజీ లోపాలు: దుమ్ము పట్టిన, తుప్పు పట్టిన రాక్‌లు, కోల్డ్ స్టోరేజ్ రూమ్‌లలో సరైన ఉష్ణోగ్రత నిర్వహించకపోవడం.

తదుపరి చర్యలు:

ఈ దాడుల్లో కల్తీ జరిగినట్లు అనుమానం ఉన్న 15 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షల నిమిత్తం పంపించారు. అలాగే నిబంధనలు పాటించని మరో 5 స్టోర్లకు షోకాజ్ నోటీసులు, 3 స్టోర్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. కాగా, డ్రాప్‌క్స్ లాజిస్టిక్స్ సంస్థపై ఎలాంటి సస్పెన్షన్ చర్యలు తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి